ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్ : గహ నిర్మాణాలకు అనుకూల వాతావరణం వుందని, మండల టీమ్ క్షేత్ర స్థాయిలో పర్యటించి లబ్దిదారుల అవసరాలు గుర్తించి, సమన్వయంతో సహకారం అందించగలిగితే పురోగతి సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం జగనన్న కాలనీలలో గహ నిర్మాణాల పురోగతి, ఓటిఎస్ రిజిస్ట్రేషన్‌లపై జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) వెంకటేశ్వర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ నుండి అన్ని మండలాల టీమ్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
జిల్లా కలెక్టర్ వివరిస్తూ ఇప్పటికే గహ నిర్మాణాలు ప్రారంభమై 10 నెలలకు పైగా అయిందని, లబ్దిదారుల వద్దకు మండల టీమ్ వెళ్ళి అవగాహన కల్పించా లన్నారు. అధికారులు ముందుగా సూక్ష్మ స్థాయిలో సచివాలయం వారీగా సొంత గహాలు/ కాలనీ గహాలు మంజూరు, వాటి పురోగతి వివరాలు ఉండాలని సూచిం చారు. మండలాల వారీగా సమీక్షలో గ్రౌండింగ్, బేస్మెంట్, రూఫ్ లెవల్, పూర్తి అయిన గహాల వారీగా పురోగతిపై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం గహ నిర్మాణం, జిల్లాలో 15 శాతం లేఔట్‌లలో చిన్న పాటి ఇబ్బం దులు ఉన్నాయి. వారపు లక్ష్యాలు నిర్వహించి కనీసం రూ.3 కోట్లు వ్యయం అయ్యేలా గహ నిర్మాణాలు సాగాలని పదే పదే సూచిస్తున్నా కొన్ని మండలాల్లో అలసత్వం ఉందన్నారు. జిల్లాలో ఇంకా గ్రౌండింగ్ కానీ గహాలు 51,162 ఉన్నాయని, వారపు లక్ష్యంగా ఈ వారం 5430 నిర్దేశిస్తే, కేవలం 1,611 గ్రౌండింగ్ తీసుకునిరావడం మండల టీమ్‌ల అలసత్వం పని తీరుకు ఇది నిర్దర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుండి పీడీలు హౌసింగ్ పద్మనాభం, డ్వామా చంద్ర శేఖర్, డిఆర్‌డిఏ తులసి, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొనగా మండలాల నుండి ఎంపిడిఓలు, తహశీల్దార్లు, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.










