అందరికీ ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని పడమటి నాయుడుపల్లి సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని ఎంపిడిఒ నాగమణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ గోపినాధ్ మాట్లాడుతూ పేదలందరికీ వైద్యం అందించడమే జగనన్న ఆరోగ్యసురక్ష లక్ష్యమన్నారు. ఈ వైద్య శిబిరంలో ఊపిరితిత్తులు, గుండె, కంటి పరీక్షలు, బిపి, సుగర్ పలురకాలు వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు. వైద్య పరీక్షలు అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఆరోగ్య సురక్ష పథకంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్యపరీక్షలు చేయించుకున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పధకాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాసులు నాయుడు, సర్పంచ్ జయమ్మ, వైసిపి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చెవుల శ్రీనివాసులు యాదవ్, సోషల్ మీడియా ఓంకారం శివ, నాయకులు కొండయ్య, చింతకుంట రామకృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, మండల వైద్య విస్తరణ అధికారి కొండారెడ్డి, వైద్య, ఐసిడిఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










