May 04,2023 11:05

మహిళలకు మా నమ్మకం నువ్వే జగనన్న స్టిక్కర్లను అందిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి

         అనంతపురం : రాష్ట్రంలో అందరికీ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం రూరల్‌ మండలం కక్కలపల్లి కాలనీలో బుధవారం నాడు 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమం చేపట్టారు. జడ్పీ ఛైర్మన్‌ బోయ గిరిజమ్మ, అధికారులు, సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు, బలహీన, ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని ప్రజలకు తెలిపారు. కాలనీలో అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.