Mar 09,2022 22:09

విజయోత్సవ సభలో ఎమ్మెల్యే ను సత్కరిస్తున్న నూతన ట్రస్టుబోర్డు సభ్యులు


ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
స్థానిక ధూర్జటి కళాప్రాంగణంలో బుధవారం మహాశివరాత్రి ఉత్సవాల విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల విజయవంతంలో భాగస్వాములైన అధికారులను, సిబ్బందిని, పాత్రికేయులను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆలయం తరపున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరమేశ్వరుడి కటాక్షం, ప్రజల సహకారంతో ఈ ఏడాది కూడా మహాశివరాత్రి ఉత్సవాలను జయప్రదం చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆలయ సిబ్బంది నిద్రాహారాలు మాని ఉత్సవాల విజయవంతానికి కృషి చేశారన్నారు.