
కవిటి: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే జనసేన లక్ష్యమని జనసేన రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్, ఇచ్ఛాపురం జనసేన ఇన్‌ఛార్జి దాసరి రాజు అన్నారు. కవిటి మండలం లండారిపుట్టుగ గ్రామానికి చెందిన జనసేన క్రియా శీలక సభ్యుడు నర్తు జోగారావుకు రూ.50వేల ప్రమాదబీమా చెక్కును శనివారం అందించారు. అనంతరం పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ వ్యవస్థలను, రాజకీయాలను భ్రష్టు పట్టించిన వైసిపికి చరమగీతం పాడాలంటే జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దాసరి రాజు మాట్లాడుతూ వైసిపి పాలనలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం మొదటిసారి వచ్చిన రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్‌ను జనసేన నాయకులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బైపల్లి ఈశ్వరరావు, మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి నాగుల హరి బెహరా, భూపతి అర్జున్ రాజు, డొక్కరి ఈశ్వరరావు, మీసాల రవికుమార్,ి పైడిరాజు, శైలజ, సరస్వతి, దుగాన దివాకర్, కాళ్ల దాలయ్య పాల్గొన్నారు.