ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ జిల్లా వ్యాప్తంగా డా||బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లోనూ అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతపురం జెడ్పీ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వద్ద జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కలెక్టర్ ఎమ్.గౌతమి రాష్ట్ర విద్యా సలహాదారు ఆలూరి సాంబశివా రెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ సేవలను కొనియాడారు.










