Nov 01,2023 23:20

అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న అప్పలరాజు

ప్రజాశక్తి- పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డు సీతారామనగర్‌లో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని రాష్ట్ర మత్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు ప్రజల అభున్నతి కృషి చేసిన మహానీయుడు అంబేద్కర్‌ అన్నారు. ఎన్నో సంస్కరణలు చేపట్టడంతో నేడు అంబేద్కర్‌ అందరివాడిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్లు మీసాల సురేష్‌ బాబు, బోర బుజ్జి, కౌన్సిలర్లు, వైసిపి నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.