Apr 14,2023 22:10

అనంతపురంలో నివాళి అర్పిస్తున్న కెవిపిఎస్‌ నాయకులు

ప్రజాశక్తి-గుత్తి       అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిస్తామని సిపిఎం కార్యవర్గ సభ్యురాలు సావిత్రమ్మ అన్నారు. శుక్రవారం సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం నుంచి పట్టణంలోని పత్తికొండ రోడ్డు కూడలిలోని అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పట్టణంలో ప్రచారం చేపట్టారు. మతోన్మాద బిజెపి, పెరిగిన ధరల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రామదాసు, రమేష్‌, సిపిఎం మండల కార్యదర్శి బి.రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు వి.నిర్మల, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి యు.మల్లికార్జున, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎస్‌.మున్నీ, సిపిఐ నాయకులు నరసింహ, మాబు మాహముద, నూర్జహాన్‌ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో..
స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌ హాలులో ఎస్పీ కె.శ్రీనివాసరావు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎఆర్‌ అదనపు ఎస్పీ ఎ.హనుమంతు, ఆర్‌ఎస్‌ఐ లు రాజశేఖర్‌ రెడ్డి, భాస్కర్‌, రమేష్‌ నాయక్‌, ప్రవీణ్‌, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్‌ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌ నాథ్‌, సుధాకర్‌ రెడ్డి, తేజ్‌ పాల్‌ తదితరులు పాల్గొన్నారు.
కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో..
కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కెవిపిఎస్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో ఏ నారాయణపురం నుంచి బైక్‌ ర్యాలీ చేపట్టారు. కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప హాజరై జెండా ఊపి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్‌ ఎదుట ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబద్కేర్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో ఎండ వేడిమి ఉన్న నేపథ్యంలో జయంతిలో పాల్గొన్న వారందరికి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు జి.వెంకటేష్‌, జిల్లా నాయకులు అక్కులప్ప, ఎర్రిస్వామి, నల్లప్ప, రాజా, శివ, మోహన్‌, మద్దిలేటి, కృష్ణ, శంకర్‌, నాగేంద్ర, శ్రీరామ్‌, రాజశేఖర్‌, మహబూబ్‌బాషా, షరీఫ్‌, వలి, సాదిక్‌ తదితరులు పాల్గొన్నారు.
ఎడిసిసి బ్యాంకులో..
స్థానిక ఏడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బ్యాంకు చైర్‌ పర్సన్‌ లిఖిత అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. బ్యాంకు సీఈవో రాంప్రసాద్‌, జనరల్‌ మేనేజర్‌ సురేఖరాణి, నాబార్డ్‌ డిడిఎం అనురాధ, బ్యాంకు సీనియర్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జెఎన్‌టియులో..
జెఎన్‌టియు పరిపాలన భవనం వద్ద ఉపకులపతి ఆచార్య రంగజనార్ధన, రెక్టార్‌ ఆచార్య విజయకుమార్‌, రిజిస్టార్‌ ఆచార్య సి.శిశిధర్‌ లు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వర్శిటీ ఎస్‌సి, ఎస్‌టి సెల్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య రజిత అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. డైరెక్టర్లు ఆచార్య కేశవరెడ్డి, ఆచార్య దుర్గా ప్రసాద్‌, ఆచార్య సుబ్బారెడ్డి, ఆచార్య సురేష్‌బాబు, ఆచార్య శోభాబిందు, ఆచార్య కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.