అమూల్ డెయిరీని పరిశీలించిన కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: అమూల్ డెయిరీ ఆవరణలో ఉన్న జగిల్‌క్లిరెన్స్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం డిసిఓ బ్రహ్మానంద రెడ్డితో కలసి అమూల్ డెయిరీని పరిశీలించి డెయిరీ ఆవరణలో ఉన్న జగిల్స్‌తో పాటుగా ఉన్న వేస్టేజిని వారంలో పూర్తిగా తొలిగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డెయిరీకి సంబంధించి పనులు ప్రారంభించుకొనుటకు వీలుపడుతుందని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డెయిరీ అభివద్ధి అధికారి రవి చంద్రన్, వనిజ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.










