మాట్లాడుతున్న కమిషనర్
అమృత కలశ యాత్ర..
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించేలా అమత కలశ యాత్రను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ పేర్కొన్నారు. ఆజాది కా అమత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నా భూమి నా దేశం రెండవ విడత అమత కలసి యాత్ర బుధవారం నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాలలో ఘనంగా నిర్వహించారు. వార్డుల స్థాయిలో డోలు నగరా వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలతో ఇంటింటికి తిరిగి మట్టిని, బియ్యాన్ని సేకరించారన్నారు. సచివాలయ వార్డు అడ్మిన్, కార్యదర్శుల నేతత్వంలో ప్రజలకు పంచ ప్రాణప్రతిజ్ఞ చేయించారు. సేకరించిన అమత కలశాలు, మట్టిని నగరపాలక సంస్థ స్థాయిలో కలుపుకొని రెండు పెద్ద అమత కలశాలు ఏర్పాటు చేసి మట్టి, బియ్యాన్ని కలిపి కార్యక్రమం పూర్తి చేశారు. అనంతరం భారత సైన్యానికి చెందిన విశ్రాంత ఉద్యోగులను సన్మానించారు. రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగం ఉన్నతాధికారులు కార్యక్రమాలు సజావుగా జరిగేలా పర్యవేక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.










