అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం: డిఆర్‌డిఎ పిడి
చిత్తూరుఅర్బన్: భారత స్వాతంత్య్రం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చిత్తూరు డిఆర్‌డిఏ పీడి తులసి తెలిపారు. ఆజాదిక అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం డిఆర్‌డిఏ జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీని పిడి ప్రారంభించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఏ అధికారులు వెంకటేష్ రవి, మధు, నాగేశ్వరరావు, సూరి, జిల్లా సమాఖ్య ప్రతినిధులు జయశ్రీ, మంజుల, నూర్జహాన్, సెల్వి పాల్గొన్నారు.










