ప్రజాశక్తి-నెల్లూరు :ఆంధ్రప్రదేశ్ ఆవిర్బావానికి కషిచేసి అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరవలేనివని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ కొనియాడారు. బుధవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటేశ్వర కస్తూరిబా కళాక్షేత్రంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కలెక్టర్ ఎం హరి నారాయణన్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నగరం మేయర్ పోట్లూరి స్రవంతి, నగర పాలక సంస్థ కమీషనర్ వికాస్ మర్మత్, అసిస్టెంట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, ఆర్డిఒ మలోలతో తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ జీవితానికి సంబంధించిన పలు విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.కలెక్టర్ హరి నారాయణన్ మాట్లాడుతూ, తెలుగు భాష కోసం తెలుగు ప్రజల కోసం ఆంధ్రరాష్ట్ర ఆవిర్బావానికి ప్రాణత్యాగం చేసిన గౌరవ అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లా వాసులు కావడం మనకెంతో గర్వకారణమన్నారు. నగరం మేయర్ స్రవంతి, మాజీ ఎంఎల్‌సి మాదాసు గంగాధరం మాట్లాడారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు శ్రీ కె.వి. చలమయ్య ను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జెడ్‌పి సిఇఒ చిరంజీవి, డిఆర్డిఏ, డ్వామా, ఐసిడిఎస్ పిడి లు సాంబశివారెడ్డి, వెంకట్రావు, హేన సుజన, డిఇఓ గంగా భవానీ, డిటిసి బి చందర్, ఐటిడిఏ పిఓ మందా రాణి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, జిల్లా వ్యవసాయ శాఖాధికారి సుధాకర్ రాజు ఉన్నారు.










