వెదురుకుప్పం (చిత్తూరు) : అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా... బుధవారం వెదురుకుప్పంలోని ఎంపిడిఒ కార్యాలయంలో అధికారులు అమరజీవికి నివాళులర్పించారు. జెడ్పీటీసీ చలం పాళ్యం సుకుమార్, రాష్ట్ర వైసిపి నేత బట్టే సుబ్రమణ్యం,పెరుమాళ్ళపల్గి ఎంపిటిసి తోకల మురళి రెడ్డి, వైసిపి యువనేత కేశవులు, ఎంపిడిఒ కార్యాలయ సిబ్బంది, తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి అసువులు బాసిన మహనీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.










