పాల ప్యాకెట్లను అందజేస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి
ప్రజాశక్తి-అనంతపురం 10 వేలమంది పాడి మహిళా రైతుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మ డెయిరీ పాల నాణ్యతను ప్రజలు ఒకసారి చూడాలని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్థానిక పాపంపేట, కక్కలపల్లి కాలనీ పంచాయతీలతోపాటు చిన్మయనగర్‌లో మహిళలు, వైసిపి నాయకులు కలిసి శనివారం ఇంటింటికీ వెళ్లి పాల ప్యాకెట్లను సరఫరా చేశారు. నేడు అనంతపురం రూరల్‌లో శాంపిల్ పాకెట్లు అందజేస్తారని వివరించారు. పది రోజుల్లో లక్ష ఇళ్లకు శాంపిల్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, మండల కన్వీనర్లు, ఎంపిపి, జెడ్పీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.










