అమిద్యాలకు వెళ్తున్న శ్రీవారు
ఉరవకొండ : మండలంలోని పెన్నఅహోబిలంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు ముగియడంతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు శనివారం పెన్నఅహోబిలం నుంచి అమిద్యాల కు తరలివెళ్లారు. ఇందులో భాగంగా తెల్లవారుజాము నుంచే స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. బ్రహోత్సవాల సందర్భంగా ఈనెల 2న అమిద్యాల గ్రామం నుంచి ఉత్సవ విగ్రహాలను పెన్నఅహోబిలం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఉత్సవాలు ముగియడంతో స్వామివారి ఉత్సవ విగ్రహాలను అమిద్యాలకు తీసుకొచ్చారు. దీంతో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఇఒ విజరుకుమార్, అర్చకులు ద్వారాకనాథ్‌స్వామి, మయూరం బాలాజీస్వామి, గుండురావు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










