Sep 26,2022 22:57

ఆలయానికి ఆదాయం పెంచడమే లక్ష్యం
ట్రస్టుబోర్డు సమావేశంలో తీర్మానం
ప్రజాశక్తి- ఐరాల:
కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానంను దాతల సహకారంతో ఆదాయాన్ని పెంచి తిరుమల తరహలో అంచెలంచెలుగా అభివద్ధి చేయాలని ఆలయ ట్రస్టుబోర్డు సమావేశంలో తీర్మానం చేసినట్లు ఆలయ ఈఓ ఎంవి.సురేష్‌ బాబు, ట్రస్టుబోర్డు ఛైర్మెన్‌ ఎ.మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం కార్యనిర్వహణాధికారి పరిపాలన భవనసమావేశ మందిరంలో ఛైర్మెన్‌ అధ్యక్షతన ఈవో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కాణిపాకం దేవస్థానంలో 2022 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 20వ తేదీ వరకు 21రోజులు పాటు స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా విజయవంతం చేసినందుకు వివిధ శాఖల అధికార్లుకు, ఆలయ అధికారులకు, పాలకమండలి సభ్యులకు, ఉభయదార్లుకు, స్థానికులకు, భక్తులకు ప్రతి ఒక్కరికి దేవస్థానం తరపున కతజ్ఞతలు తెలిపారు. మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి స్వామివారి సందర్శనార్థం తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లపై చర్చించామన్నారు. భక్తులకు మౌలికవసతులు కల్పించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. అలాగే భక్తులు సౌకర్యార్థం త్వరలో బ్రేక్‌ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఆదాయం పెంచి ఆలయాన్ని అభివద్ధి చేయడానికి తనవంతు కషి చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు నెల ఆలయ ఆదాయవ్యయాలు తదితర అంశాలపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఎన్‌.సోమశేఖర్‌, గోవర్ధన్‌, మారుతీశ్వరరావు, కొండయ్య, సుశీల, కాంతమ్మ, సుబ్బలక్ష్మమ్మ, ప్రతిమ, వెంకటరమణమ్మ, ఈఈ వెంకట నారాయణ, ఎసీ కస్తూరి, ఎఈఓలు విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వి కష్ణారెడ్డి, రవీంద్రబాబు, హేమమాలిని, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌ బాబు, ఉమేష్‌ పాల్గొన్నారు.