Oct 04,2023 21:42

ధర్మానకు చిత్రపటాన్ని అందిస్తున్న ఆలయ ఇఒ

* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : 
జిల్లాలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం అన్నివిధాలుగా తోడ్పాటు అందిస్తోందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ధర్మ ప్రచార వారోత్సవాలను బుధవారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఆలయాన్ని సందర్శించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. దాతల తోడ్పాటుతో అరసవల్లిని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుందన్నారు. అందుకు అవసరమైన సహకారాన్ని తాను అందిస్తున్నట్టు తెలిపారు. సంస్కృతి పరిరక్షణ భవిష్యత్‌ తరాలకు అందించడం ఎంతో అవసరమన్నారు. ధర్మ ప్రచార కార్యక్రమాల్లో స్థానిక కళాకారులకు భాగస్వామ్యం కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఇఒ వి.హరి సూర్యప్రకాష్‌, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి సభ్యులు మండవిల్లి రవి, లుకలాపు గోవిందరావు, దుక్క గన్నిరాజు, జె.శ్రీనివాస్‌, మైలపల్లి లక్ష్మి, ద్వారపు అనురాధ తదితరులు పాల్గొన్నారు.