ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి
ప్రజాశక్తి -ఐరాల
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీస్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 21వ తేదీన మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి ఈవో సురేష్ బాబు కోరారు. ఈ సందర్భంగా గురువారం కాణిపాకం కార్య నిర్వాహణాధికారి చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ ధ్వజస్తంభ కార్యక్రమాన్ని దాతల సహాయంతో దిగ్విజయంగా పూర్తి చేసామన్నారు. ఈనెల 21వ తేదీన కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కుంభాభిషేకం సందర్భం గా ఆర్జిత సేవలను 21వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 21వ తేదీన ఉదయం 11:30 గంటల నుంచి 12:30 గంటల వరకు యథావిధిగా దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈనెల 10వ తేదీన కలెక్టర్ ఆదేశాల మేరకు సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉభయ దారులు సమావేశానికి హాజరు కావాలని పిలుప నిచ్చారు. బ్రహ్మోత్సవానికి సంబంధించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నా మన్నారు. కుంభాభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కుంభాభిషేకం బ్రహ్మోత్సవాలకు ఉభయదారులు, గ్రామస్తులు, భక్తులు సహకరించాలని కోరారు. కుంభా భిషేకం నేపథ్యంలో స్వామివారు దీక్షలో ఉంటారు కాబట్టి ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. కాణిపాకం ఆలయ అభివద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.










