Apr 20,2023 09:47

చలివేంద్రంలో నీళ్లు తాగుతున్న అల్ట్రాటెక్‌ సిబ్బంది

       తాడిపత్రి రూరల్‌ : వేసవిని దష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తి తీర్చేందుకు అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ ఆధ్వర్యంలో మండల పరిధిలోని బుగ్గ గ్రామం వద్ద చలివేంద్రాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అల్ట్రాటెక్‌ యాజమాన్యం మాట్లాడుతూ బుగ్గ గ్రామ పరిధిలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యం ఏదో అవసరం మీద బుగ్గ మీదుగా ప్రయాణం చేస్తుంటారని, వేసవి వేడి అధికంగా ఉన్న నేపథ్యంలో వారి దాహార్తిని దష్టిలో తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభించామని అడ్మినిస్ట్రేషన్‌ శ్రీఅంజన్న ప్రకాష్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్ట్రాటెక్‌ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.