Oct 16,2023 19:55

కోలాటం ఆడుతున్న దృశ్యం

కోలాటం ఆడుతున్న దృశ్యం
అలరించిన కోలాటం
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:అమ్మ దర్శనం.. అపురూపం. అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. శరవన్న రాత్రుల సందర్భంగా టౌన్‌ ఆస్పేటలోని కన్యకా పరమేశ్వరి ఆలయం విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ ఆలయంలోని అమ్మవారు సోమవారం శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఏర్పాటు చేసిన కోలాటం చూపరులను ఆకట్టుకుంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ ధర్మకర్తల మండలి గౌరవ అధ్యక్షులు, నూడా చైర్మన్‌ ముక్కాల ద్వారకనాథ్‌ ప్రెసిడెంట్‌ శ్రీరామ్‌ వెంకట సురేష్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ జనార్ధన రావు, సెక్రటరీ రమేష్‌ బాబు, కోశాధికారి ఈశ్వర మురళీకష్ణ, జాయింట్‌ సెక్రటరీ రమేష్‌ బాబు, మురళి తదితరులు పాల్గొన్నారు.