Feb 19,2022 21:51

ఎంపికైన విద్యార్థులను అభినందిస్తున్న తేజోమూర్తి

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
ప్రముఖ బహుళ జాతి సంస్థ ఆల్‌సెక్‌ టెక్నాలజీకి 91 మంది విజయం కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం స్థానిక చిత్తూరు సుందరపురంలోని విజయం బిజినెస్‌ స్కూల్‌లో నిర్వహించిన ప్రాంగణ ఎంపిక ఫలితాలను శనివారం విడుదల చేయడం జరిగిందన్నారు. తమ సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 91 మంది ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు రెండు లక్షలకు పైగా వార్షిక వేతనం అందుతుందన్నారు. ఎంపికన విద్యార్థులను తేజోమూర్తి, అధ్యాపక బృందం అభినందించారు