చనిపోయిన రొయ్యలను తీస్తున్న దృశ్యం
ఆక్వారైతు నడ్డి విరిచిన అధికారులు
కరెంట్ కట్‌తో రూ.25లక్షలతో నష్టపోయిన రైతు
ప్రజాశక్తి-విడవలూరు :అర కొరఆదాయంతో భవిష్యత్తుపై రొయ్యలు సాగు చేస్తున్న ఓ ఆక్వారైతు నడ్డిని ఊటుకూరు సబ్ స్టేషన్ ట్రాన్స్‌కో అధికారులు విరిచేశారు.ఈ సంఘటన పొన్నపూడి పెద్దపాలెం పాతురు గ్రామప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్బంగా ఆక్వాసాగు చేస్తున్న రైతు అప్పంగారి రవిచంద్ర మంగళవారం పాతురు లో ఆవేదన వ్యక్తం చేశారు. తాను ట్రాన్స్‌కోకు ఎలాంటి విద్యుత్ బకాయి లేదని బిల్లులను సకాలంలో చెల్లించానని అయినా కూడా ఉన్నపళంగా తమ సర్వీసులకు వెళ్లే లైన్ జంపర్ అధికారులు తొలగించారు. దీంతో విద్యుత్ సరఫరా ఆగి సాగులో ఉన్న రొయ్యలకు ఆక్సిజెన్ అందక చనిపోయినట్లు చెప్పారు. మరో వారం రోజుల్లో పంట చేతికి అందె సమయంలో ఇలా చేయడం వల్ల తనకు రూ.23లక్షలు విలువ చేసే సరుకు డ్యామేజ్ అయిందని, దీనికి బాధ్యత ట్రాన్స్ కో అధికారులు లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తెలపకుండానే విద్యుత్ సరఫరా లేకుండ చేయడం రైతు నడ్డి విరిచారన్నారు. తన భవిష్యత్తు పై దెబ్బ తీశారన్నారు.2.50ఎకరాల రొయ్యలు సాగును చేపడుతున్న క్రమంలో నిన్నటికి 45కౌంట్ పరిమాణం ఉందన్నారు నోటికి వచ్చిన కూడూ తీసేసిన ట్రాన్స్ కో అధికారుల ఇందుకు బాధ్యత వహించి నష్టాన్ని పూడ్చాలన్నారు. సుమారు 7టన్నులు పైగా రొయ్యలు ఉంటాయన్నారు. తాము వాడుతున్న విద్యుత్ సర్వీస్ నెంబర్లు,3251216000102, 105 111కలిగిన వాడకంలో ఉందని, వీటిపై ఎలాంటి బకాయిలు లేవని బాధితుడు రవి చంద్ర వాపోయాడు. ఆర్థికంగా నలిగి పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.










