ప్రజాశక్తి-అనంతపురం అక్టోబర్ నెలలో కిసాన్ డ్రోన్స్ పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ హరికిరణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ఈపంట నమోదుపై మండల స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అక్టోబర్ మాసంలో కిసాన్ డ్రోన్స్ పంపిణీ చేయనున్న నేపథ్యంలో పైలట్ ట్రైనింగ్ ఇచ్చేందుకు రైతులను గుర్తించాలన్నారు. అదేవిధంగా పి.ఎం కిసాన్ ఇకెవైసిని పూర్తి చేయాలన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులను నిల్వ చేసి రైతులకు సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారిణి యు.ఉమామహేశ్వరమ్మ, సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం.రవి, పద్మజ, గురుమూర్తి, యల్లప్ప, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారిణి యు.ఉమామహేశ్వరమ్మ, అధికారులు










