ప్రజాశక్తి- తిరుపతి సిటీ
స్థానిక వివి మహల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆకృతి షోరూం ప్రారంభానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. వస్త్రాలయంలో కలియ తిరిగి నూతన వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా షోరూమ్ అధినేతలు బంగారు పుల్లయ్య, సీతారామరాజు, మురళీకష్ణ మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఆకృతి లేడీస్ వేర్ షోరూం గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా మన్నన పొందిందన్నారు. ప్రస్తుతం ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరంలో ఆకృతి షోరూమ్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. లెగ్గిన్స్, దుప్పటాస్, కుర్తాస్, డ్రెస్ మెటీరియల్ వివిధ రకాల మహిళా వస్త్రాలను తక్కువ ధరలకే అందిస్తున్నామన్నారు. కార్పొరేటు షోరూములకు దీటుగా మహిళలకు అవసరమైన అన్ని రకాల వస్తువులను షోరూంలో అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, టిటిడి బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, జెడ్‌పి చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, విజరుకుమార్, తమన్నా, రాధా, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.










