మాజీ మేయర్ కఠారి హేమలతను పరామర్శిస్తున్న చిన్న రాజప్ప
చిత్తూరుఅర్బన్: ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే వారిపై పోలీసుల ద్వారా గంజాయి అక్రమ కేసులు పెట్టడం, ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని అనగదొక్కడం రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయిందని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతున్న మాజీ మేయర్ కఠారి హేమలతను గంగనపల్లి బిఎంఆర్ గార్డెన్స్‌లోని ఆమె నివాసంలో పరామర్శించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.










