Apr 01,2022 16:59

ప్రజాశక్తి-పిచ్చాటూరు : ఆరణియార్ నదీ పరివాహక ప్రాంతంలో నడుస్తున్న అక్రమ ఇసుక రీచ్ లను రద్దు చేయకపోతే రహదారులను దిగ్బంధం చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వందవాసి నాగరాజు, ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ హెచ్చరించారు. శుక్రవారం రోజున చిత్తూరు జిల్లా లోని పిచ్చాటూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం , ఎస్ ఎస్ బి పేట పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాల ఆధ్వర్యంలో ఇసుక రీచ్ లను రద్దు చేయాలని ధర్నా చేశారు.ధర్నాలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షురాలు పి హేమలత ఆధ్వర్యంలో పలు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ధర్నాకు మద్దతుగా  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కిన కాంట్రాక్ట్ దారులు అక్రమంగా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను కంటే భిన్నంగా 15 నుంచి 20 అడుగుల లోతు వరకు నదిలో ఇసుక తవ్వకాలు ఎలా జరుపుతారు అని ప్రశ్నించారు. వాల్టా చట్టాలను నిబంధనలను పక్కన పెట్టి నిర్వాహకులు వారి ఇష్టానుసారంగా అధిక లోతులో ఇసుకను తవ్వితీసి టిప్పర్లలో పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు, అధిక లోడుతో లక్షల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అని విమర్శించారు. ఈ విధంగా ఇసుకను తరలించడం వల్ల నది పరివాహక గ్రామాలైన ఎస్ ఎస్ బి పేట,ఈండ్ర పేట, హనుమంతపురం , సురుటుపల్లి, కారణి, మలిమేలు కండ్రిగ, చిన్నాప్పట్టు, నందనం, బయట కోడింబేడు, అడవి కోడింబేడు,  బంగాళ, కారూరు, పులికుండ్రం, తదితర గ్రామాల లకు వ్యవసాయ భూములకు నీళ్లు లేక, తాగడానికి కూడా నీళ్లు లేక త్రాగడానికి కూడా నీళ్లు లేక, భూగర్భజలాలు అడుగంటి గా మారే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వెలుబుచ్చారు. సంఘం అధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ, అక్రమ ఇసుక రీచ్ల పైన గ్రామస్తులు పోరాటం చేస్తుంటే కాంట్రాక్టర్లు ఇసుక కాంట్రాక్టర్లు రాత్రిపూట గ్రామాల్లో కరెంటు నిలిపివేస్తున్నామని విమర్శించారు.ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, భోజనం చేసి దౌర్జన్యం చేసి గ్రామస్తులను భయపెట్టి అక్రమంగా  తెల్ల బంగారాన్ని లూటీ చేస్తున్నారు అని విమర్శించారు, గ్రామస్తులు మాట్లాడుతూ అక్రమ ఇసుక రీచ్ లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. రైతు సంఘం నాయకులు రమేష్ మాట్లాడుతూ పోలీసులు రెవెన్యూ అధికారులు స్పందించకపోతే సమస్యను రాష్ట్రస్థాయిలో తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నాగరాజు, మురుగేష్, పి జీతంగా రాజు, ఓబులు, ఎస్ ఎస్ బి పేట విలేజ్ పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు సురేష్ మణికంఠ, పలు గ్రామాల రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.