వినతి ఇస్తున్న సిపిఎం నాయకులు.
ప్రజాశక్తి- మదనపల్లె రూరల్
సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా మదనపల్లె ఆర్‌డిఓ మురళికి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జా చేసి జెసిబి, హిటాచీలతో మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని విమర్శించారు. దీనిపై విచారణ జరిపి వారికి అండగా నిలుస్తున్న అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు టి.హరీంద్రనాథ్ శర్మ, డి.ప్రభాకర్‌రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.










