Apr 01,2022 13:11

ప్రజాశక్తి-పిచ్చాటూరు (చిత్తూరు) : చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం ఎస్‌ ఎస్‌ బి పేట గ్రామం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అరికట్టాలని తహశీల్దార్‌ కార్యాలయం ముందు సిపిఎం నేతలు శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ నిరసనలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, రైతు సంఘ కార్యదర్శులు హేమలత, దాసరి జనార్ధన్‌, నాయకులు, ఎస్‌ ఎస్‌ బి పేట గ్రామ ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.