Dec 05,2022 22:38

డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులక నుగుణంగా ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్లతో బోధన చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం సీనియర్‌ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించకుండా అర్ధాంతరంగా బదిలీలు చేపట్టడాన్ని యుటిఎఫ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రఘుపతి రెడ్డి, జిల్లా కార్యదర్శి జివి రమణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిప్యూటేషన్‌ల పేరుతో ఉపాధ్యాయులను సుధీర ప్రాంతాలకు బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్న తీరు నిరసిస్తూ సోమవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుధాకర్‌ రెడ్డి, జీవి రమణ, జిల్లా గౌరవాధ్యక్షులు సోమ శేఖర్‌ నాయుడు, జిల్లా కార్యదర్శిలు రెడ్డెప్ప నాయుడు, సరిత, ఎస్‌ పి బాషా, బిర్లా నాయుడు, మండల శాఖ నాయకులు ఏకాంబరం, చిట్టిబాబు, రేవతాపతి పిళ్ళై, పార్థ సారథి, సురేష్‌, నాగరాజ,మునికష్ణయ్యా , జబరాజ్‌, రాజేంద్ర, యుగంధర్‌, అన్ని మండల కార్యకర్తలు పాల్గొన్నారు.