భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు :'ఆకలికి అందరూ బంధువులే అనే నినాదంతో ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ కందుకూరు వారి ఆధ్వర్యంలో సోమవారం దాతల సహాయంతో పట్టణంలో పేదలను గుర్తించి వారికి భోజనాల ప్యాకెట్లు అందించారు. ప్రతి ఒక్కరు తమ సామాజిక బాధ్యతగా పేదవారికి సాయం అందిస్తే సమాజానికి ఎంతో మేలు జరుగు తుందని ఫౌండేషన్ సెక్రెటరీ షంషేర్ తెలిపారు. ప్రెసిడెంట్ సాజిద్,ట్రజరర్ హఫీజ్, ఇంచార్జ్ అయూబ్ ఖాన్ పఠాన్ షంషఉద్దీన్ పాల్గొన్నారు.










