Oct 14,2023 19:05

భోజనం ప్యాకెట్లు అందిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు : 'ఆకలికి అందరూ బంధువులే'' అనే నినాదంతో ఐ.ఎఫ్‌.సి ఫౌండేషన్‌ కందుకూరు వారి ఆధ్వర్యంలో శనివారం దాతల సహాయంతో పేదవారికోసం కందు కూరులో నిస్సహాయులైన వారిని గుర్తించి వారికి భోజనాల ప్యాకెట్లు అందజే స్తున్నారు. ప్రతి ఒక్కరు తమ సామాజిక బాధ్యతగా పేదలకు చేయూత నివ్వాలని అని ఫౌండేషన్‌ సెక్రెటరీ షంషేర్‌ తెలిపారు. ప్రెసిడెంట్‌ సాజిద్‌,ట్రజరర్‌ హఫీజ్‌, ఇన్‌చార్జ్‌ అయూబ్‌ ఖాన్‌ పఠాన్‌ షంషుద్దీన్‌ పాల్గొన్నారు.