Feb 25,2022 23:00

సమావేశంలో మాట్లాడుతున్న నగర మేయర్‌ అముద

మేయర్‌ ఎస్‌.అముద
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌ :
ఐదేళ్ల లోపు వయసున్న ప్రతిఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని చిత్తూరు నగర మేయర్‌ ఎస్‌.అముద పిలుపుని చ్చారు. శుక్రవారం నగరపాలక సమావేశ మందిరంలో పల్స్‌ పోలియో కార్యక్రమంపై నగర పాలక సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నగర పరిధిలోని అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆరోగ్య కార్యదర్శులు, ఆశా కార్య కర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ... ఆదివారం నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయ వంతంగా చేపట్టాలని, అన్ని వార్డుల పరిధిలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించా లన్నారు. కమిషనర్‌ పి. విశ్వనాథ్‌ మాట్లాడుతూ... చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పల్స్‌ పోలియో కార్యక్రమం కోసం 120 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పల్స్‌ పోలియో కార్య క్రమాన్ని విజయ వంతం చేయాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీహరి మాట్లాడుతూ... పల్స్‌ పోలియో కార్య క్రమాన్ని వైద్యాధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలతో నిర్వహించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ రాజేష్‌ కుమార్‌ రెడ్డి, డీఐవో రవిరాజు, ఎస్పీహెచ్వో శ్రీనివాస రావు, ఎస్వో రమేష్‌ రెడ్డి, ఎంహెచ్వో అనిల్‌ కుమార్‌, అర్బన్‌ హెల్త్‌ కేంద్రాల వైద్యులు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు.