May 10,2023 11:54

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం రూరల్(ఇటుకలగుంట) : ఉపాధి హామీ పరిరక్షణ ఆటో ప్రచార యాత్ర ఈరోజు ఉదయం 8 గంటలకు గ్రామంలో ఉపాధి పని ప్రదేశము నుండి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం చెట్టి సత్యనారాయణ ప్రారంభ సభను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఉపాధి హామీని గొంతు నులుముతూ నిర్వీర్యం చేస్తూ వచ్చిందని ఈ సంవత్సరం ఉపాధి హామీకి భారీగా నిధులు తగ్గించిందని ఉపాధి హామీని కాపాడుకోవడం కోసం కూలీలు ఐక్యతతో కేంద్ర ప్రభుత్వంపై పోరాడి ఉపాధి హామీ చట్టాన్ని ప్రకటబందిగామల కోసం పోరాడాలని అన్నారు. ఉపాధి హామీని కాపాడుకోవడం కోసం సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 12వ తేదీన జరుగుతున్న భీమవరం కలెక్టరేట్ ధర్నాలో కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆటో యాత్రను వ్యవసాయ కార్మిక సంఘం జెండాను ఊపి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ యాత్ర మెట్ట ఉప్పరగూడెం చిన తాడేపల్లి కడి యద్ద జగ్గన్నపేట వెంకటరమణ గూడెం జగన్నాధపురం నవాబుపాలెం నందమూరి మారంపల్లి గ్రామాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కండెల్లి రమేష్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు, రైతు సంఘం మండల కార్యదర్శి పాలు పూరి సత్యనారాయ, మాగంటి చింతారావు పాష్యం చిన్న పెద్దిరాజు,  కోరసిక మారమ్మ పాల పూరి దేవి, గోకనబోయిన సుబ్బరాజు, ఉక్కుసూరి శ్రీనివాసరావు, పెద్దిరాజు మాగంటి చెల్లయ్య, పాలపూరి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.