Feb 27,2023 15:42

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం పంచాయతీ పరిధిలో గల కృష్ణాపురం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కండెల్లి సోమరాజు ఉపాధి పనులను సందర్శించి కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు 6 గంటలకే ఆన్లైన్లో మస్తర్ వలన  అనేక ఇబ్బందులు పడుతున్నామని, తిరిగి మరల రెండో పూట మస్తర్ ఓపెన్ అయ్యేటప్పటికీ మధ్యాహ్నం అవుతుందని దీంతో అనేక ఇబ్బందులు గురవుతున్నామని తమ గోడును తెలిపారు. రెండు పూటలా మస్తర్ లతో అష్ట కష్టాలు పడుతున్నామన్నారు. ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ ఈ సంవత్సరం బడ్జెట్లో ఉపాధి హామీకి 33% తగ్గించి 60 వేల కోట్ల రూపాయలు కేటాయించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బడ్జెట్లో సవరణ చేసి కూలీల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ బడ్జెట్లో నిధులు పెంచాలని రెండు పూటలా ఆన్లైన్లో మస్తర్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం తలారి సుబ్బారావు, మల్లిపూడి వెంకటేశులు, రేకపల్లి నాగమణి, కండెల్లి లక్ష్మి, పోలిశెట్టి సుజాతలతో కమిటీ ఏర్పాటు చేశారు.