ఐఐటిలో శ్రీ విద్యావికాస్ జయభేరి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
ఆదివారం విడుదల చేసిన ఐఐటి జీమైన్స్ ఫలితాల్లో శ్రీవిద్యా వికాస్ విద్యార్థులు ప్రభజనం సృష్టించారిని కళాశాల కరెస్పాండెంట్ ప్రకాష్ చంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూజిత 9,797 (56) పల్లవి 11,649 (51), నందిని 28,685 (59), లక్ష్మి 64056 (77) సాధించారని తెలిపారు. విద్యాసంస్థల వ్యవస్థాపకులు చంద్రారెడ్డి, రామాజులు మాట్లాడుతూ ఇంటర్, ఎంసెట్ ఫలితాలో శ్రీవిద్యావికాస్ విద్యార్థులు టౌన్ ఫస్ట్ కౌవసం చేసుకోవడంతో పాటు ఐఐటిలో ర్యాంకులు సాధించడం తమ విద్యాసంస్థలకు గర్వకారణమన్నారు. ఈసందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుమూర్తి, వైఎస్ ప్రిన్సిపాల్ రాజు, ఏఒ గోపి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










