Oct 16,2023 22:43

మాట్లాడుతున్న వైస్‌ ప్రిన్సిపాల్‌ శంకరనారాయణ

ప్రజాశక్తి - శ్రీకాకుళం: ఆహార ఉత్పత్తులు తగ్గితే మానవ జీవన ప్రమాణాలకు ప్రమాదకరమని ప్రభుత్వ మహిళా కళాశాల ఐక్యూఎసి కో-ఆర్డినేటర్‌ ఎస్‌.పద్మావతి, వైస్‌ ప్రిన్సిపాల్‌ పి.శంకరనారాయణ అన్నారు. నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో సోమవారం నిర్వహించిన ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఆహారాన్ని, నీటిని అవసరమైనంత వాడుకోవాలలన్నారు. నీటి ప్రాముఖ్యతను వివరించారు. అకడమిక్‌ కో-ఆర్డినేటర్‌ సిహెచ్‌.కృష్ణారావు మాట్లాడుతూ 600 మిలియన్ల మంది ప్రజలు జీవనోపాధి కోసం కనీసం పాక్షికంగానైనా జల, ఆహార వ్యవస్థలపై ఆధారపడి ఉన్నారని చెప్పారు. ఆర్థికశాస్త్ర విభాగాధిపతి టి.ఆదిలక్ష్మి, కళాశాల అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.