అగ్నికి ఆహుతైన పాడిఆవు
సజీవదహనమైన పాడిఆవు
ప్రజాశక్తి వికోట:
బాధిత రైతు కష్ణప్ప తెలిపిన వివరాల ప్రకారం గడ్డివాము మంచె కింద పాడి ఆవును కట్టి కుటుంబసభ్యులు నిద్రపోయారు. రాత్రివేళ హఠాత్తుగా గడ్డివాముకు నిప్పంటుకుని మంటలు వ్యాపించడంతో కింద ఉన్న పాడిఆవు మంటల్లో చిక్కుకుని అగ్నిలో సజీవదహనమైంది. గుర్తు తెలియని వ్యక్తులెవరో గడ్డివాముకు నిప్పుపెట్టారని బాధిత రైతు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.










