అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
ప్రజాశక్తి- పుంగనూరు: పెట్రోల్ బంకులలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు అవగాహన కల్పించారు. భగత్ సింగ్ కాలనీలో ఉన్న అగ్నిమాపక శాఖ కార్యాలయ ఆవరణలో పెట్రోల్ బంక్ యాజమాన్యం, డెలివరీ బార్సుకు శనివారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ పరిధిలో ఉన్న పుంగనూరు పట్టణానికి చెందిన పెట్రోల్ బంక్ యాజమాన్యం, డెలివరీ బార్సు కు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బంక్‌లో పనిచేస్తున్న డెలివరీ బార్సు కి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రజలకు వాహనదారులకి పెట్రోలు, డీజిల్ నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేశారు. ఈ అవగాహన సదస్సులో టిఎన్ నాగిరెడ్డి, పెట్రోల్ బంక్ యజమాన్యం, ఆర్‌ఆర్ పెట్రోల్ బంక్, మునిశివారం, ఎంఎం పెట్రోల్ బంక్, బత్తులూరి పెట్రోల్ బంకు యజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు.










