అనంతపురం : ప్రజల్లో ప్రబలుతున్న వ్యాధులకు వైద్యం కన్నా క్షేత్ర స్థాయిలో అద్యయనం పెరగాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఎసిఎస్ వైద్య సంస్థ అధినేత ప్రముఖులు పద్మభూషణ్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం సాయినగర్ 7వ క్రాస్‌లో శ్రీ శ్రీనివాస గ్యాస్ట్రో లివర్ ఆసుపత్రి నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు సరిగా దశాబ్ధకాలం ముందు తమ ప్రియ శిశ్యుడైన డాక్టర్ రజనేష్‌రెడ్డి ఆసుపత్రిని ప్రారంభించానని తిరిగి నూతన హంగులతో ఆధునిక వసతులతో సొంత భవనాన్ని ప్రారంభించటం చాలా సంతోషకరంగా ఉందన్నారు. కొత్త విధానంలో నూతన పద్ధతులలో వ్యాధినిర్థారణ, వైద్యం అందించేలా డాక్టర్ రజనేష్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. అనంతపురం లాంటి వెనుక బడిన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు ముందుకు రావల్సిన ఆవశ్యత ఉందని, అయితే జబ్బుకు మందు అందిస్తే సరిపొదని క్షేత్ర స్థాయిలో మూలలను అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ప్రతి వైద్యుడిపై ఉంటుందని తెలిపారు. ఆ కోవలో తమ బృందం అధ్యయనం దిశలో వైద్య సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రాంతీయ సమస్యలను గుర్తించాల్సి అవసరం ఉందన్నారు. ప్యాటీలివర్ సమస్య, వైరల్ సమస్య, ఆల్కాహాల్ వల్ల లివర్ సమస్యలు వస్తాయన్నారు. హెపటైటీస్ బి, సికి వ్యాక్సిన్ వల్ల సమపస్యలు తగ్గాయన్నారు. లివర్ క్యాన్సర్ అధికంగా ఉందన్నారు. అనంతపురం ప్రాంతంలో ఫుడ్ కంటామ్సెన్ వల్ల సమస్యలు అధికంగా కనపడుతున్నాయన్నారు. తినే ఆహారంలో ఆఫ్‌లోటాక్సిన్ శాతం అధికంగా ఉండడం వల్ల సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. తద్వారా లివర్ క్యాన్సర్, ఇతర లివర్ సమస్యలు తలెత్తున్నాయన్నారు. దీనిపై అద్యయనం చేయటం జరుగుతున్నదన్నారు. ఆ నివేదికల ఆధారంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశలో తమ వంతు కృషి చేస్తామన్నారు. శ్రీ శ్రీనివాస గ్యాస్ట్రో లివర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ రజనేష్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆదరణ పొందామన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సొంత భవనంలో అత్యాధునిక వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని రకాల గ్యాస్ట్రో, లివర్ సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ వైద్యులు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ ప్రసాద్‌రెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ జిల్లా వైద్యాధికారి పద్మావతమ్మ, డాక్టర్ విజయచంద్రారెడ్డి, డాక్టర్ రామ్మోహన్ చౌదరి, డాక్టర్ కొండయ్య, డాక్టర్ భానుకిరణ్, డాక్టర్ అరుణ, డాక్టర్ వీరభద్రయ్య, డాక్టర్ గుత్తారవీంద్ర, డాక్టర్ రంగు సుదీంధ్ర, డాక్టర్ ప్రసూన, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్ హరినాథరెడ్డి, మాధవరావు, డాక్టర్ శ్రీనివాసులు, మౌళాలి, పవన్‌కుమార్‌రెడ్డి, గోపినాథ్‌రెడ్డి, డాక్టర్ శ్రీవిద్య, ఐఎంఎ అధ్యక్షులు డాక్టర్ మనోరంజన్‌రెడ్డి, డాక్టర్ శివజ్యోతి, ధీరజ్ పలువురు యువవైద్యులు, రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.










