మాట్లాడుతున్న సుగుణమ్మ
కబ్జాలపై ఎమ్మెల్యే, మేయర్ స్పందించాలి- మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడిపి హాయంలో తిరుపతిలో ప్రశాంత వాతావరణం ఉండేదన్నారు. కానీ నేడు తిరుపతిలో కబ్జాల పర్వం కోనసాగుతతోందని, ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేసిన పట్టించుకునే నాధుడు లేదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ చోరవ చూపాలన్నారు. యువత మాధక ద్రవ్యాలతో పెడదారి పెడుతోందని, వీటిని నగరంలో అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించకుంటే టీడిపి కమిటీగా ఏర్పడి వీటిపై పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌్ ఆర్‌సి మునిక్రిష్ణ, సూరా సుధాకర్‌రెడ్డి, రమణ, పుష్పావతి, కుమారమ్మ తదితరులు పాల్గొన్నారు.










