Mar 31,2023 21:42

మాట్లాడుతున్న జెఎన్‌టియు ప్రిన్సిపాల్‌ పి.సుజాత

         ప్రజాశక్తి-అనంతపురం   జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులు మారుతున్న సాంకేతికకు అనుగుణంగా బోధనా నైపుణ్యాలను పెంచుకోవాలని ప్రిన్సిపాల్‌ పి.సుజాత సూచించారు. శుక్రవారం స్థానిక కంప్యూటర్‌ సైన్స్‌ విభాగ అధిపతి ఎపి.శివకుమార్‌ అధ్యక్షతన ఇంట్రడక్షన్‌ టూ ఎంఎల్‌ఎన్‌ఎల్‌పి అండ్‌ చాట్‌ బోట్స్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి శిక్షణ కార్యక్రమాల ద్వారాఉపాధ్యాయులు తమకున్న విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా పెంపొందించుకోవడానికి, విద్యార్థులకు నూతన విషయాలను అర్థమయ్యేలా బోధించడానికి అనుకూలంగా ఉండాయన్నారు. ప్రతి ఉపాధ్యాయుడూ వృత్తి ధర్మం, నైపుణ్య అభివృద్ధి, వ్యక్తిత్వ వికాసాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ ఆఫ్‌ ప్యాకల్టీ డెవలప్‌మెంట్‌ బి.ఈశ్వర్‌రెడ్డి, ఎ.సురేష్‌బాబు, బి.లలిత, కె.ఎఫ్‌.భారతి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆర్‌.భవానీ, శిక్షణా కార్యక్రమం కోఆర్డినేటర్‌ బి.చెన్నారెడ్డి, పరిశ్రమలకు చెందిన వారు బి.ఉదరుకిరణ్‌, షేక్‌ రహిముద్దీన్‌, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.