Sep 04,2023 21:42

మాట్లాడుతన్న విసి రంగజనార్ధన

          ప్రజాశక్తి-అనంతపురం   రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగు ణంగా స్థానిక జెఎన్‌టియులో పని చేసే అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు 65ఏళ్లకు పొడిగిస్తూ పాలకమండలి ఆమోదం తెలిపినట్లు ఉపకులపతి రంగజనార్ధన తెలిపారు. ఈమేరకు సోమవారం స్థానిక జెఎన్‌టియు పరిపాలన భవన్‌లోని ఉపకులపతి ఛాంబర్‌లో నూతన పాలక మండలి సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సమావేశానికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి ఆన్‌లైన్‌ లో పాల్గొనగా పాలక మండలి సభ్యులు ఆన్‌లైన్‌ ద్వారానే పదవీ బాధ్యతలు స్వీకరించారు.