Nov 13,2022 22:34

చిత్తూరు గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారిలో భారీ గోతులు గ్రామీణ రహదారులు కృష్ణంపల్లికి వెళ్లే దారులు బురదమయం

అధ్వానంగా అంతర్రాష్ట్ర

ప్రజాశక్తి- యాదమరి:
చిత్తూరు గుడియాత్తం జాతీయ అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా తయారైంది. యాదమరి మండలం జోడిచింతల పోలీసుస్టేషన్‌ నుంచి తమిళనాడు సరిహద్దు కనికాపురం చెక్‌పోస్ట్‌ వరకు ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దారులు... పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ రహదారిగుండా ప్రయాణికులు ప్రయాణించాలంటే నరకప్రాయంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు.
గత ఏడాది కురిసిన వర్షాలకు తారురోడ్డు పూర్తిగా దెబ్బతిని మరమ్మతులు నోచుకోకపోవడంతో రోడ్లలో అడుక్కోగుంత ఏర్పడ్డాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆ గుంతలు బావులను తలపిస్తున్నాయి. తరచూ వాహనచోదకులు ప్రమాదాల భారిన పడుతున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సర్వసభ్య సమావేశంలో సైతం సర్పంచులు అధికారులు దష్టికి తీసుకెళ్లారు. అయితే ఏమాత్రం ప్రయోజనం లేదు. చిత్తూరు గుడియాత్తం జాతీయ రహదారి తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంది.
ఈ మార్గంలో అడుగడుగునా భారీగుంతల దర్శనమిస్తున్నాయి. వాహనదారులు వాటిని తప్పించి ప్రయాణం సాగించడం దుర్లభంగా మారుతుంది ఈ రహదారుల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షానికి భారీఎత్తున గోతులు ఏర్పడ్డాయి. కురుస్తున్న వర్షాలు గోతుల్లో నీళ్లు నిలవడం ద్వారా ప్రమాదాలకు నిలయంగా మారాయి. రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల భారిన పడుతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది గాయాలపాలై మతిచెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ రోడ్లలో ప్రతిరోజు ప్రయాణించాలంటే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
యాదమరి మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలకు లైన కొట్టాలం వెళ్లే రహదారి, మంగదానపల్లి నుంచి కష్ణంపల్లికి వెళ్లే రహదారి, మదిరెడ్డిపల్లి రహదారి, భూమిరెడ్డిపల్లికి వెళ్లే రహదారి, కొత్తూరు ఏఏడబ్ల్యు, దసరాపల్లి ఎస్టీకాలనీకి వెళ్లే రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. వర్షపు నీటికి రోడ్లు కోసుకుపోయి వాగులను తలపిస్తున్నాయి. మరికొన్ని దారులు గుంతలు తెలియ చెరువుల మారిపోయాయి. ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. కనీసం ద్విచక్రవాహనాలు సైతం నడపలేని పరిస్థితి, ఇప్పటికైనా సంబంధిత అధికారులు, దారుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా స్పందించి రోడ్లు మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
చిత్తూరు గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారిలో భారీ గోతులు గ్రామీణ రహదారులు కృష్ణంపల్లికి వెళ్లే దారులు బురదమయం