Mar 17,2023 20:58

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
ప్రపంచ దేశాలకు దీటుగా భారత్‌ ఆధునిక సాంకేతికతలో దూసుకెళ్తోందని మహర్షి రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వేదిక్‌ టెక్నాలజీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ఆమంచి కార్తీక్‌ తెలిపారు. ఏపీ నిట్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.ప్రమోద్‌ పడోలే ఆధ్వర్యంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి.దినేష్‌ శంకర్‌ రెడ్డి పర్యవేక్షణలో ప్రాచీన భారతదేశంలో అధునాతన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిధి కార్తీక్‌ మాట్లాడుతూ భారతదేశానికి చెందిన ఎంతోమంది శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమించి ఎన్నో ఆవిష్కరణలకు రూపకల్పనలు చేశారన్నారు. అనంతరం కార్తీక్‌ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీన్‌లు డాక్టర్‌ జిఆర్‌కె.శాస్త్రి, డాక్టర్‌ ఎన్‌.జయరామ్‌, డాక్టర్‌ టి.కురుమయ్య, ఆచార్యులు డాక్టర్‌ వి.సందీప్‌, డాక్టర్‌ రమేష్‌ పాల్గొన్నారు.