Oct 21,2023 21:13

మాట్లాడుతున్న టిడిపి నాయకులు

మాట్లాడుతున్న టిడిపి నాయకులు
అధిష్టానం సంస్కారం నేర్పింది..
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:టిడిపి అధిష్టానం సంస్కారం నేర్పిందని దీంతో ప్రతి ఒక్కరినీ గౌరవించే సాంప్రదాయంతో పాటు అందరినీ సమానంగా చూస్తామని వైసిపి నేతల నోటికి బూతు మాటలు తప్ప సంస్కారంగా మాట్లాడే నైజం వారికి లేదని టిడిపి బీసీ సంఘం అధ్యక్షులు కప్పిరి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. నెల్లూరు టిడిపి కార్యాలయంలో నగిరి అధ్యక్షురాలు కపిరి రేవతితో కలిసి ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని సంస్కారంగా మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. తనపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు వైసీపీ వైపునకు రావాలని ప్రలోభాలు పెట్టిన వెళ్లలేదన్నారు. ప్రాణాలు పోయిన టిడిపిని వీడే ప్రసక్తే లేదన్నారు.
అభివద్ధి పనులు, పేద ప్రజలకు సహాయం చేయలేని వారు పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. కరోనా సమయంలో పేద ప్రజలకు సహాయం అందించి మానవత్వం చాటుకున్నారన్నారు. నెల్లూరు నగరాన్ని అభివద్ధి బాటలు వేసింది నారాయణ సహకారంతోనేనన్నారు. టిడిపి నేతలను భయపెట్టి ప్రలోభాలకు గురిచేసి వైసీపీలో చేర్చుకుంటున్నది నిజం కాదా నన్నారు. కార్యక్రమంలో టిడిపి బీసీ నేతలు ప్రసాద్‌ యాదవ్‌, సుబ్రహ్మణ్యం యాదవ్‌, వెంకయ్య యాదవ్‌, గోపి యాదవ్‌, సుధీర్‌ యాదవ్‌, సుమన్‌ యాదవ్‌, మణికంఠ, మనోజ్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.