Mar 23,2022 23:23

ధర్నా చేస్తున్న సిపిఎం, సిపిఐ, ఎస్‌ఎఫ్‌ఐ ,ఏఐఎస్‌ఎఫ్‌నాయకులు

ప్రజాశక్తి- పలమనేరు: విద్యార్థిని మిస్‌బా ఆత్మహత్యకు కారణమైన బ్రహ్మర్షి స్కూల్‌ను సీజ్‌ చేసి, కరస్పాండెంట్‌ పై క్రిమినల్‌ కేసును నమోదు చేయాలని సిపిఎం, సిపిఐ నాయకులు వేరు వేరుగా డిమాండ్‌ చేశారు. పలమనేరు పట్టణంలో ఫీజు కట్టలేదని విద్యార్థిని మానసికంగా అవమానకరంగా మాట్లాడినందుకు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి న్యాయం చేయాలని బ్రహ్మర్షి పాఠశాల ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ , ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.శశికుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రైవేట్‌ పాఠశాల నడిపిస్తున్న బ్రహ్మర్షి పాఠశాల కరస్పాండెంట్‌ రమేష్‌పై తక్షణమే క్రిమినల్‌ కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో డీఈఓ ఆఫీస్‌ ఎదుట పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నామని తెలిపారు. సీపీఐ, సిపిఎం, ఎస్‌ఎఫ్‌ఐ ,ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు విద్యార్థి మతదేహానికు నివాళులర్పించారు. వాళ్ల తల్లిదండ్రులకు అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఓబుల్‌ రాజు, గిరిధర్‌ గుప్తా, భువనేశ్వరి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మద్దెల సుబ్రహ్మణ్యం, సీపీఐ నాయకులూ మంజు నాతు, కడిరప్ప. ఎస్‌ఎఫ్‌ఐ ఏఐఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ నాయకులు ప్రేమ్‌ చంద్‌, ఉదరు, వరలక్ష్మి, ఇందు, తదితరులు పాల్గొన్నారు.