ప్రజాశక్తి-కుందుర్పి కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని.. తాను ఎల్లవేళలా అండగా ఉంటానని మంత్రి కెవి.ఉషశ్రీచరణ్ భరోసా ఇచ్చారు. ఎంపిపి కమలా నాగరాజు అధ్యక్షతన మంగళవారం మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయం సమీపంలో వైఎస్‌ఆర్ ఆసరా మూడో విడత మెగా చెక్కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక తెలుగు తమ్ముళ్లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. వీటన్నింటినీ దీటుగా ఎదుర్కొని రాబోయే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళలతో కలిసి సిఎం జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రాధాస్వామి, మండల కన్వీనర్ సత్యనారాయణశాస్త్రి, సర్పంచి మారుతీశ్వర రామమూర్తి, వైస్‌ఎంపిపిలు శ్రీలక్ష్మీ అజరుబాబు, బిజీ సోమనాథ్, ఎంపిటిసి గంగమ్మ హనుమంతురాయుడు, కో ఆప్షన్ సభ్యుడు ముజీవుల, వాల్మీకి స్టేట్ డైరెక్టర్ పాలాక్షి, సింగిల్‌విండో ఛైర్మన్ వన్నూర్‌రెడ్డి, ఎంపిడిఒ నారాయణస్వామి, తహశీల్దార్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
కుందుర్పిలో మెగాచెక్కు పంపిణీ చేస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్










