అడవిపల్లి రిజర్వాయర్ సందర్శన
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: చిత్తూరుకి శాశ్వత తాగునీరు అందించే, పీలేరు సమీపంలోని అడవిపల్లి రిజర్వాయర్‌ను బుధవారం చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ డీఈఒ, ఏఈలు సందర్శించారు. ఈసందర్భంగా డీఈ పుష్పగిరి నాయక్ మాట్లాడుతూ అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరు వరకు 93 కిలోమీటర్ల మేర పైప్లైన్ ద్వారా నీటిని తరలిస్తూ, మార్గమధ్యంలో దామలచెరువు దగ్గర వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నీటిని శుద్ధి చేసి, చిత్తూరు నగరానికి అందిస్తామన్నారు. ఇది అమత పథకం కింద రూ.250కోట్లతో ఖర్చు చేస్తున్నామన్నారు. 2055వ సంవత్సరానికి పెరిగే జనాభా అవసరాలని దష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని రూపొందించామని అన్నారు. 2024 మార్చి నాటికి దాదాపుగా ప్రాజెక్టు పనులు పూర్తవుతుందని, ఒక రోజుకు 37లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేసి చిత్తూరు నగర కార్పొరేషన్‌కు అందిస్తామని, తదనంతరం కార్పొరేషన్ వారు ట్యాంకులు, ఇదివరకే ఉన్న పైపులైన్ల ద్వారా ఇంటింటికి నీరు చేరుస్తారన్నారు. కార్యక్రమంలో తాండవ మూర్తి, శివకుమార్, సత్య, కేశవరెడ్డి, నాగేందర్ లు పాల్గొన్నారు.










