Mar 29,2022 22:41

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు


ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం:
దేశంలో 33శాతం అడవులు ఉంటే నేడు 22 శాతం మాత్రమే ఉన్నాయని, అడవులను కొంతమంది స్వార్థం కోసం అడవులను నాశనం చేస్తున్నారని, ప్రపంచ జీవకోటికి అడవులు ఆక్సిజన్‌, అనేక రకాల ఔషదాలు అందిస్తుందని, కొంతమంది తమ స్వార్ధప్రయోజనాల కోసం అడవులకు నిప్పు పెట్టి నాశనం చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. అడవులు ప్రతి ఏటా అగ్ని ప్రమాదానికి గురై వందల హెక్టార్ల సంఖ్యలో ద్వంసమౌతున్నాయన్నారు. అడవులను, జంతువులను కాపాడుకోవడం మానవాళి భాధ్యతగా మెలగాలన్నారు. పై విషయాలను ప్రజలకు నాటక రూపంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి బీట్‌ ఆఫీసర్‌ లక్ష్మీప్రసాద్‌, లోకేష్‌, సుభాషిని, పోలీసులు పాల్గొన్నారు.