అదుపుతప్పి కారు బోల్తా
ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు
ప్రజాశక్తి- శాంతిపురం:
కుప్పం-పలమనేరు జాతీయ రహదారిలోని కడపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రాళ్లబూదుగూరు ఎస్సై మునుస్వామి తెలిపిన వివరాల మేరకు.. కుప్పం పట్టణానికి చెందిన న్యాయవాది నటరాజ్ కుమారుడు ఈశ్వర్ ఆదిత్య (27) రైల్వే రాధ కుమారుడు భరత్ (29), టిబి రోడ్డులోని గజేంద్ర కుమారుడు త్యాగరాజు(26)లు కారులో ఆదివారం రాత్రి స్వంత పనిమీద వీకోట వైపు వెళ్లి 11.45 గంటలకు కుప్పంకు తిరుగు ప్రయాణమయ్యారు. కారును వేగంగా నడుపుతూ కడపల్లి సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటిని ఢకొీన్నారు. ఈప్రమాదంలో ఈశ్వర్ ఆదిత్య, భరత్ అక్కడికక్కడే మతిచెందారు. తీవ్రంగా గాయపడిన త్యాగరాజును కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు వంద పడకల ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తికావడంతో సోమవారం ఉదయం మతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు రాళ్లబూదుగూరు ఎస్సై మునుస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










